ఉదయం 6 గంటల నుంచే తనిఖీలు
సీఆర్‌పీ బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు
అరెస్టుపై అధికారికంగా వెల్లడి కాని వివరాలు
ప్రతిపక్షం ఖానాపూర్ నవంబర్ 21: ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ నివాసంలో శుక్రవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ప్రత్యేక బృందంగా చేరుకున్న అధికారులు ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ పరిణామం ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు నిర్మల్ జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
వివిధ కోణాల్లో విచారణ. ఈడీ సోదాలకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
రేఖా నాయక్‌కు సంబంధించిన ఆస్తుల వ్యవహారమా? లేక ఏఆర్ఎస్ పేరుతో నిర్వహిస్తున్న రైస్ మిల్లులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుగుతోందా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.
సీఆర్‌పీఎఫ్ బలగాలతో భద్రత
ఈడీ సోదాల విషయం అధికారులు ముందస్తు జాగ్రత్తగా సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించి ఇంటి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.సోదాల అనంతరం ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటిస్తేనే విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే రేఖా నాయక్ అరెస్టుపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.ఇంకా కొనసాగుతున్న ఈడీ సోదలు.





























