కలం కార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలి

•రద్దయిన 1955, 1958 వర్కింగ్ జర్నలిస్ట్ లకు చట్టబద్ధమైన రక్షణలను పునరుద్ధరించాలి

•సమగ్ర మీడియా కమిషన్, నూతన వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి

•జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలి

•టీయూడబ్ల్యూజే(ఐజేయూ)రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్​

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రతిపక్షం): సమాజంలో ఫోర్త్​ ఎస్టేట్​ గా పిలవబడే జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, ప్రభుత్వాలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయని.. కలం కార్మికుల హక్కలు పరిరక్షణ, భద్రతను పట్టించుకొని ప్రభుత్వాలు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్​ డిమాండ్​ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా టీయూడబ్ల్యూజె(ఐజేయు) రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్​ లోని గాంధీ విగ్రహం వద్ద జిల్లాలోని వర్కింగ్​ జర్నలిస్టులు అందరూ హక్కుల పరినక్షణ, భద్రత కల్పన కోసం గళమెత్తి నల్లబ్యాడ్జీ ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన కార్యక్రమానికి ముఖ్య అథిగా హాజరై మాట్లాడారు. దీర్ఘకాలంగా కలం యోధులు ఎన్నో సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.దశలవారీగా ఉద్యమిస్తున్నా కనికరం కూడా చూపడం లేదని మండిపడ్డారు.ప్రస్తుత పరిస్థితిలో జర్నలిస్టులు ఎంతో పేదరికంలో మగ్గుతున్నారని..తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులైన వర్కింగ్​ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇంట పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో జాప్యం చేస్తూ జర్నలిస్టులను అభాగ్యులుగా మిగులుస్తున్నారని అన్నారు.

అక్రిడిటేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహించి రెండేళ్లు లేటుగా కార్డులు ఇచ్చిందని..అర్హులైన చాలా మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్​ కార్డులను నోచుకోలేదని గుర్తు చేశారు.జర్నలిస్టులకు కేంద్రం ప్రభుత్వం రైలులో 50 శాతం రాయితీతో ప్రయాణించేందుకు గతంలో పాసులు జారీ చేసేది. కరోనా అనంతరం వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు.వెంటనే వాటిని పునరుద్ధరించాలని డిమాండు చేశారు.మీడియా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సమగ్ర మీడియా కమిషన్, నూతన వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని,జర్నలిస్టుల భద్రతకు రద్దయిన 1955, 1958 వర్కింగ్ జర్నలిస్ట్ చట్టబద్ధమైన రక్షణలను పునరుద్ధరించాలని, కేంద్ర, రాష్ట్ర చట్టాలు తీసుకురావాలని డిమాండు చేశారు.జర్నలిస్టులకు గతంలో చట్టబద్ధంగా కల్పించిన ఉద్యోగ భద్రత, సేవా నిబంధనలు, వేతనాలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన హక్కులను పునరుద్ధరించాలని కోరారు.

జర్నలిస్టులు, జర్నలిస్టేతర మీడియా సిబ్బందికి ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు కల్పించేందుకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలని కోరారు.వనపర్తి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సదుపాయాలు కల్పించడంతో పాటు అక్రిడిటేషన్, గుర్తింపు కార్డులు, విధి నిర్వహణకు అవసరమైన సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని.. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.నిరసన కార్యక్రమంలో యూనియన్​ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవరావు, రాజు, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, వనపర్తి టౌన్​ కమిటీ, అన్ని మండలాల ప్రెస్​ క్లబ్​ల అధ్యక్షులు, కార్యదర్శులు , మీడియా ప్రతినిధులు తమ గళాన్ని వినిపించారు. కార్యక్రమలో జిల్లాలోని వర్కింగ్​ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News