తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది.

*రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయం.

*రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది.

*మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 11: తెలంగాణ ప్రజల గుండెల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేక స్థానం ఉందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి పథకంలోనూ కేసీఆర్‌ను దేవుడిలా చూస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం, సాగునీటి సదుపాయాలు, తాగునీటి వసతి, పేదల సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమంలో కేసీఆర్ పోషించిన పాత్రను, రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమం వంటి అంశాల చుట్టూనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కొనసాగిందని, తెలంగాణ ప్రజలతో కేసీఆర్‌కు ఉన్న అనుబంధం, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు కారణమవుతోందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు

Spread the love

Related News

Latest News