[t4b-ticker]

చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు

*చండూరు మండలంలో ఇప్పటివరకు 611 దరఖాస్తులు.

*సెప్టెంబర్ 15 వరకు అవకాశం – ఎంపీడీఓ యాదగిరి.

ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 01: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు చండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) బండారు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు) పేషెంట్లు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ బాధితుల పెన్షన్ల మంజూరుకు గతంలో ఆగస్టు 31 వరకు చివరి తేదీగా నిర్ణయించగా, అర్హులైన చాలా మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదనే ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.దరఖాస్తుదారులు తమ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులను అందజేసి తప్పనిసరిగా రసీదులు పొందాలని సూచించారు. చండూరు మండలంలో ఆగస్టు 31 వరకు చండూరు మండలంలో మొత్తం 611 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీఓ వెల్లడించారు.
వితంతువులు – 245
ఒంటరి మహిళలు – 29
దివ్యాంగులు – 130
చేనేత కార్మికులు – 05
గీత కార్మికులు – 202
ఇంకా అర్హులైన వారు ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే తమ గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

1. చేయూత పెన్షన్లకు గడువు పెంపు
2. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ – ఎంపీడీఓ
3. చండూరు మండలంలో 611 పెన్షన్ దరఖాస్తులు

Spread the love

Related News

Latest News