[t4b-ticker]

చండూరులో ఎఐటియుసి రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ.

*కరీంనగర్ లో ఎఐటియుసి రాష్ట్ర 4వ మహాసభలు – జయప్రదం చేయాలి.
*కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు .
*చండూరులో పోస్టర్లు ఆవిష్కరించిన ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేష్.

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 01: కరీంనగర్ లో సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో జరగనున్న ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేష్ పిలుపునిచ్చారు.
సోమవారం చండూరు పట్టణంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎంతో కష్టపడి, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా మారుస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు.సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులందరికీ ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.
కార్మికులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల శ్రీనివాసులు, ఎఐటియుసి మండల అధ్యక్షుడు భూతారాజు దేవదాసు, ఎఐటియుసి నాయకులు భూతరాజు రవి, కల్లెట్ల వెంకన్న, తీగల రామకృష్ణ, భూషిపాక నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News