[t4b-ticker]

ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం

ప్రతిపక్షం, జూలై 29: ఢిల్లీలోని ఏఐసీసీ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.

అలాగే సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌ తదితర ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాలు, రాబోయే రాజకీయ కార్యాచరణ, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News