బీఆర్‌ఎస్‌ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి

ప్రతిపక్షం, జూలై 21: తాను బీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తోనే కొనసాగుతానని, పార్టీ కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు.

మల్లారెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మన్నె క్రిశాంక్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. పలువురు నేతలు కూడా ఇదే విషయంపై మల్లారెడ్డిని ట్యాగ్‌ చేయడంతో ఆయన తాజాగా స్పందించారు. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News