మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నేత ఆంజనేయులు సిపిఎం జిల్లా నేత మల్లేశం
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 05: కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్వర్ నిర్ణయంతో సార్ ప్రక్రియ ద్వారా దేశంలో లక్షలాది ఓట్లు తీసివేయడం జరిగిందని దీని బాధ్యత వహిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో రేపు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు సిపిఎం జిల్లా నాయకులు ఏ మల్లేశం తెలిపారు మెదక్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సార్ ప్రక్రియ ద్వారా దేశంలో చాలా ఓట్లు తీసివేయడం జరిగిందని కేవలం ముస్లింల ఓట్లను పెట్టుకొని ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది ఓట్లు గల్లంతయాయాన్ని వారి పేర్కొన్నారు ఈ దేశంలో మేధావులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల ఓట్లు సైతం గల్లంత కావడం దురదృష్టకరమని వారు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు అనుసరిస్తున్న నేపథ్యంలో అనేక పోరాటాలు జరిగాయని ముఖ్యంగా రైతుల కోసం తీసుకువచ్చిన నల్ల చట్టాలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో క్షమాపణ చెప్పాడని వారు గుర్తు చేశారు. విద్యార్థుల పోరాటంతో కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సంఘటన వారు గుర్తు చేశారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యత్రిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా కూటమి ధార బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు. దేశాన్ని రక్షించడం కోసం దేశ ప్రజల అభ్యున్నత కోసం కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినాడని వారు అన్నారు.
బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. సార్ ప్రక్రియ లో పూర్తి బాధ్యత వహి స్తూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్. వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంగాధర్. సిపిఎం నాయకులు షౌకత్ మల్లేశం మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ హరిత. బొజ్జ పవన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





























