ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

ప్రతిపక్షం, జూలై 20: మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. హైదరాబాద్‌ మోతీనగర్‌లోని తన సోదరుడి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

వెంటనే ఆయనను ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఆరోపణలపై విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టగా, ఆరోపణలు నిజమేనని తేల్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ઘટના‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News