[t4b-ticker]

త్వరలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

•వనపర్తి, పెబ్బేరులో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా సివరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం

•వనపర్తికి రూ.20 కోట్లు, పెబ్బేరుకు రూ.9.20 కోట్లు మంజూరు

•ఎమ్మెల్యే మేఘారెడ్డి విజ్ఞప్తి మేరకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి, ఆగస్ట్ 10, ప్రతిపక్షం: వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలలో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు సివరేజ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.29.20 కోట్లు మంజూరు చేసింది.వనపర్తి, పెబ్బేరు పట్టణంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు…పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా సివరేజ్ ప్రాజెక్టు చేపట్టాలని వనపర్తి ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుని ప్రాజెక్టులకు ఆమోదం కల్పించారు.త్వరలోనే ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే.మేఘా రెడ్డి తెలిపారు.

స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో వనపర్తి మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, పెబ్బేరు మున్సిపాలిటీకి రూ.9.20 కోట్ల నిధులు కేటాయించారు.ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో ఇళ్ల నుంచి, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడే మురుగునీటిని శాస్త్రీయంగా సేకరించి, సివరేజ్ వ్యవస్థ ద్వారా తరలించి, శుద్ధి చేసి సురక్షితంగా నిర్వహించే సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయి. తద్వారా పట్టణ పారిశుధ్యం మెరుగుపడటంతో పాటు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరనుంది.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వనపర్తి నియోజకవర్గంలో పట్టణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి,జిల్లా ఇన్చార్జి మంత్రి.దామోదర్ రాజనర్సింహ,జిల్లా మంత్రులు.జూపల్లి కృష్ణారావు,వాకిటి శ్రీహరి, ఎంపీ.మల్లు రవిలకు ఎమ్మెల్యే. మేఘా రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Related News

Latest News