[t4b-ticker]

కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం

అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

వాల్ పోస్టర్ విడుదల చేసిన పట్టణ సీఐ

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 10: ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతి యువకులకు అఖిలరాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్.ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం ఫౌండేషన్ చైర్మన్ తాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ నిరుపేద యువతి యువకులు అన్ని వర్గాలకు చెందినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం సాధించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో పరీక్ష కు హాజరై అర్హత సాధించిన వారికి నాగూర్ కర్నూల్.వట్టెం వద్దా పి సి ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఆయన తెలిపారు.

యువతి యువకులు ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైన వారు16 తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో జరుగు అర్హత పరీక్షకు హాజరుకావాలని. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుండి శిక్షణ పూర్తయ్య వరకు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రమశిక్షణ. అంకిత భావం. సంకల్పశక్తి. విజయానికి మార్గమని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే.7416661182నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది. శివ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News