2027 నాటికి కాళేశ్వరం పునరుద్ధరణ: మంత్రి ఉత్తమ్

ప్రతిపక్షం, జూలై 21: తెలంగాణలో ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును 2027 నాటికి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై శాస్త్రీయ పరిశీలన పూర్తయిందని, పునరుద్ధరణకు అనుగుణంగా డిజైన్లను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని వచ్చే ఏడాది జూన్‌ వరకు పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.

Spread the love

Related News

Latest News