ప్రతిపక్షం,శామీర్ పేట, అక్టోబర్ 03: వినాయక నిమజ్జనాల్లో భాగంగా అలియాబాద్ మున్సిపల్ పట్టణ బస్టాప్‌లోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్వామివారి లడ్డూ వేలం పాట ఉత్సాహంగా జరిగింది. వేలం పాటలో ఇప్ప మాధవరెడ్డి రూ.1 లక్ష 73 వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంటం శిరీష కృష్ణారెడ్డి, జీనోమ్ వ్యాలీ సీఐ గురువయ్య, ఎస్‌ఐ రఘు, కౌన్సిలర్లు యమున శ్యామ్, ముద్దం సుధీకర్‌రెడ్డి, గూదె వెంకటేశ్, కైర గణేష్, గాదె వెంకటేశ్, హనుమాన్‌దాస్, వినాయక మండపం నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.





























