ప్రతిపక్షం, అక్టోబర్ 13: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంటి యజమానులు ఊరికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి యజమానులు ఊరికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ల్యాప్‌టాప్, టీవీ, సౌండ్ బాక్సులు, టేబుల్ ఫ్యాన్‌తో పాటు ఐదు తులాల వెండిని దొంగలు అపహరించినట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా ఆధారాలు సేకరించి, చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.





























