ప్రతిపక్షం, జూలై 27: ఇతరుల అభివృద్ధిని చూసి అసూయపడటం మనిషిని మానసికంగా బలహీనపరుస్తుందని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. శత్రువులైనా, మిత్రులైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు వారిని చూసి ఈర్ష్య చెందకుండా, ముందుగా మనలోని అసూయను విడిచిపెట్టాలని సూచించారు.
ఇతరుల విజయాన్ని చూసి బాధపడటం కంటే, దానిని స్ఫూర్తిగా తీసుకుని మన లక్ష్యాల కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. వారి అభివృద్ధి మనకు ప్రేరణ కావాలే గానీ, అసూయకు కారణం కాకూడదన్నారు.
సానుకూల దృక్పథంతో ముందుకు సాగితేనే జీవితంలో నిజమైన విజయం సాధించగలమని, మనసులోని ఈర్ష్యను దూరం చేసుకోవడం వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని గరికిపాటి నరసింహారావు వివరించారు.

















