‘తాలూకా’ పదం తెలంగాణలో వాడం.. కానీ: కవిత

ప్రతిపక్షం, జూలై 14: ‘వెంకటరామయ్య గారి తాలూకా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ‘తాలూకా’ అనే పదాన్ని సాధారణంగా ఉపయోగించరని పేర్కొన్న ఆమె, రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల మధ్య ఆత్మీయత కొనసాగాలని ఆకాంక్షించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరస్పరం ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవాలని, భాషా–సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కవిత అన్నారు. రాజకీయాలు వేరు అయినా తెలుగు ప్రజల అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్‌ను ఉద్దేశించి కవిత సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో ఆయన స్వరపరిచిన ‘మూడు రంగుల జెండా పట్టి’ పాట కారణంగా తనకు ఆయనపై కోపం ఉందని చమత్కరించారు. కవిత వ్యాఖ్యలతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి.

Spread the love

Related News

Latest News