ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 10: మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సుమారు ఒక్క ఎకరా స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జిల్లా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు తనా వంతు కృషి చేస్తానని. ఆయన తెలిపారు. ప్రభుత్వం తరఫునుండి 50 లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు రెండు దఫాలుగా డబ్బులను కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారు. బ్రాహ్మణ సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శాలక రాజేశ్వర శర్మ, నాయకులు వైద్య శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ. జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ భవనం నిర్మాణానికి మైనంపల్లి సహకరించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఈ భవనం సేవా కార్యక్రమాలు చేయడం కోసం నిర్వహిస్తామని నిత్యం అన్నదాన కార్యక్రమం తో పాటు వేసవి కాలంలో తాగునీటి వస్తువులు కల్పించడంతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని నిరుపేదలకు ఉచితంగా పెండ్లీలు చేసుకునే అవకాశం కల్పిస్తామని వారు అన్నారు అనంతరం. మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్ మాట్లాడుతూ బ్రాహ్మణ కమిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలను కేటాయిస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు. కాశీనాథ్ రావు శర్మ.హరిప్రసాద్ శర్మ. దేశ పేట లింగమూర్తి.వైద్య ప్రభాకర్ శర్మ. డిజె శ్రీనివాస్ శర్మ.కృష్ణ మూర్తి, శ్రీనివాస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర శర్మ, డివిజన్ దేశాయ్ పేట్ లింగమూర్తి, డివిజన్ ప్రధాన కార్యదర్శి వైద్య శ్రీనివాస్ శర్మ, టి జె శ్రీనివాస్ కామేశ్వర రావు, పల్లమ్మ రాజు కళ్యాణ్. మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్.కౌన్సిలర్లు రాజవ్వ.నర్సింలు. లలిత. గంట సంపత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్. నాయకులు మేడి మధుసూదన్ రావు బొజ్జ పవన్ ఉప్పల రాజేష్. దయాసాగర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



















