ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు ఉద్ధృతం కానున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. జులై 3 నుంచి 5 వరకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో కూడా మూడు రోజుల పాటు మేఘావృత వాతావరణం కొనసాగడంతో పాటు సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
పింక్ రంగుతో సూచించిన జిల్లాల్లో రోజుకు 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు, ఎరుపు రంగుతో గుర్తించిన జిల్లాల్లో 50 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

















