కూతురు తప్పు చేసి ఉంటే కఠిన శిక్ష పడాలి: సియా తల్లిదండ్రులు

ప్రతిపక్షం, జూన్ 26: కాబోయే భర్త కేతన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా వ్యవహారంపై ఆమె తల్లిదండ్రులు తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, కూతురిపై వస్తున్న ఆరోపణలను ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని తెలిపారు.

పెళ్లి నిర్ణయానికి ముందు పలుమార్లు ఆమె అభిప్రాయం అడిగామని, ప్రతి సారి కేతన్‌ను ఇష్టపడుతున్నానని చెప్పిందని వెల్లడించారు. చేతన్‌ను తన స్నేహితుడిగా మాత్రమే పరిచయం చేసిందని, అతనితో ప్రేమ సంబంధం ఉన్న విషయం తమకు తెలియదని పేర్కొన్నారు.

ఒకవేళ దర్యాప్తులో తమ కూతురే నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే చట్టం ప్రకారం ఎంత కఠినమైన శిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలని, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని వారు కోరారు.

Spread the love

Related News

Latest News