ఏడుపాయల్లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

వన దుర్గ మాత గాయత్రి దేవిలో దర్శనమిస్తున్నారు

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్ అక్టోబర్ 12: ఏడుపాయల వన దుర్గాభవానీ మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం అమ్మవారు భక్తులకు గాయత్రీ దేవి (బ్రహ్మచారిణి) రూపంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు, శాస్త్రోక్త పూజలు ఘనంగా నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కన్ను గుణంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ఈఓ వీరేశం తెలిపారు భక్తులందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈవో తెలిపారు.

Spread the love

Related News

Latest News