Trending Now

అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు..

సీఎస్​కు ముఖ్యమంత్రి ఆదేశం..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని, అందుకు తగు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. సీఎం ఆదేశంతో ఆమె అంత్యక్రియల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

సాయన్న చనిపోయి ఏడాది అయిందని.. అయిన నాలుగు రోజులకే కూతురు చనిపోవడం బాధాకరమన్నారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. తండ్రి లాగానే జనాలతో కలివిడిగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆమె మృతి అందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉంటూ వస్తున్నానని హడావిడిగా కార్యక్రమాలకు పోతుంటామని.. అందరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

Spread the love