ప్రతిపక్షం, జూన్ 19: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 19 మంది నిందితులకు కూడా కోర్టు సమన్లు పంపినట్లు సమాచారం. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
తాజాగా కోర్టు సమన్లు జారీ చేయడంతో ఈ కేసు విచారణ మరో కీలక మలుపు తిరిగింది. సోమవారం జరిగే విచారణపై సినీ వర్గాలు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

















