జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులపై కేంద్రం ఫోకస్

ప్రతిపక్షం, జూలై 01: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపజేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

డీలిమిటేషన్ బిల్లును ఈ సెషన్‌లో ఆమోదింపజేయడానికి ఎన్డీయే కూటమి వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోక్‌సభలో మెజార్టీ బలం పెంచుకునేందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ బిల్లును కూడా ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తీసుకురావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Spread the love

Related News

Latest News