ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్ పోరులో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేదో నేడు తేలనుంది. చెపాక్ వేదికగా ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్‌లో RR, SRH అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరుజట్లు బలంగా కనిపిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా హైదరాబాద్ 10, రాజస్థాన్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ నెగ్గింది.
సన్ రైజర్స్ హైదరాబాద్‌కు చెపాక్ భయం.. గెలుస్తుందా..?
IPLలో నేడు కీలక పోరు జరగనుంది. ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే క్వాలిఫయర్-2 జరిగే చెన్నై చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్‌కు చెత్త రికార్డు ఉంది. అక్కడ సన్‌రైజర్స్ 10 మ్యాచులు ఆడగా.. ఎనిమిదింటిలో ఓడింది. ఒక మ్యాచ్ గెలవగా, మరో మ్యాచ్ టై అయింది. మరి ఈ సెంటిమెంట్‌ను కమిన్స్ సేన బ్రేక్ చేసి, విజయం సాధిస్తుందేమో చూడాలి.