Trending Now

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఆప్‌లో చేరిన ఎమ్మెల్యే

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయన ఆప్ లో చేరారు. పంజాబ్‌లో ఆప్‌ కుటుంబం బలపడిందని ఆ పార్టీ ఎక్స్‌ వేదికగా పేర్కొంది. హోషియార్‌పూర్ జిల్లాలోని చబ్బేవాల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్‌కుమార్ చబ్బే వాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా అనుకూల విధానాలకు ప్రభావితమై ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారని ఆప్ పార్టీ పేర్కొంది. అయితే చబ్బేవాల్ తన రాజీనామాకు గల కారణాలను ప్రస్తావించలేదు.

Spread the love