Trending Now

ప్రొఫెసర్ కోదండరాం ను కలిసిన నిర్మల్ డీసీసీ అధ్యక్షులు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 25 : తెలంగాణ జన సమితి అధినేత, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ను నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఎన్ రెడ్డి కాలనీ లో ప్రొఫెసర్ కోదండరాం ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. రాష్ట్ర రాజకీయాలు, జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రజలకు ఉద్యమానాయకుడుగా, రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడిగా సుపరిచితుడని అన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన కొరకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారని.. సబ్బండ వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారని అన్నారు. ఇందులో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రవోతూ రాజేందర్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు కొట్టే శేఖర్, తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News