సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం స్ఫూర్తిగా సాయన్న జీవితం
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 22: తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పండుగ సాయన్న 147 వ జయంతి ఉత్సవాలను గురువారం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పండుగ సాయన్న జీవితం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని, సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి విలువలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ, పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ఆనందకరమన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, శాఖ సిబ్బంది, ముదిరాజ్ సంఘం నాయకులు మెట్టు గంగారం, ముదిరాజ్ సంఘం మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మనగల రామకృష్ణయ్య, భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు మామిళ్ల ఆంజనేయులు నోముల శ్రీకాంత్ సాయిరాం భీమరిశ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు చింతల రమేష్. పాపన్నపేట శ్రీనివాస్ ముదిరాజ్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






























