చండూరు మున్సిపాల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 02: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చండూరు పురపాలక సంఘం కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ… మహాత్మా గాంధీ సత్యం, అహింసా మార్గాలను అనుసరించి దేశ ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. గాంధీజీ చూపిన మార్గం నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

అలాగే గాంధీజీ స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, “స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత” అనే భావనతో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచేందుకు మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, సామ సుజాత యాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, కల్లెట్ల చంద్రకళ మారయ్య, షేక్ సలీమా షరీఫ్, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ ఏ. జగన్, వార్డ్ ఆఫీసర్ జి. శ్రీరాములు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Spread the love

Related News

Latest News