కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఎర్రవల్లికి బీఆర్ఎస్ నేతల పాదయాత్ర

రెండో రోజు కొనసాగుతున్న యాత్ర.. 50 మంది కార్యకర్తలతో ముందుకు సాగుతున్న నాయకులు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 17: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం నుంచి ఎర్రవల్లి వరకు పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.మంగళవారం చిన్నశంకరంపేట నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, కల్వకుంట సర్పంచ్ అందె కొండల్ రెడ్డి, నాయకుడు గంజి నవీన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కార్యకర్తలతో కొనసాగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, వనదుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి పదేళ్ల పాలన వరకు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.

రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి, సంక్షేమ పథంలో పయనించాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.ఈ పాదయాత్రలో శంకరంపేట-ఆర్ మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, రజక్‌పల్లి సర్పంచ్ కనకరాజు, బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకులు గంజి నవీన్, శ్రీనివాస్, మావురం రాజు, వివిధ మండలాల నాయకులు వినయ్, ప్రవీణ్, సల్మాన్, నగేష్, అంతేలి నాగరాజు, కనుక రాజు, స్వామి, రాజు, శేఖర్, శ్రీకాంత్, సాయి, నరేష్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News