Trending Now

ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోని కడెం మండలంలో గల అల్లంపల్లి, బాబానాయక్ తాండ గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికలను సోమవారం బహిష్కరించారు. గ్రామాలకు సరైన రోడ్లు సౌకర్యం లేదని పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. గ్రామాలకు పక్కా తారు రోడ్డు ఏర్పాటు చేస్తామని ఉన్నత అధికారులు సరైన భరోసా ఇస్తేనే ఓట్లు వేస్తామని మొండికేస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అల్లంపల్లి, బాబానాయక్ తాండలలో గల పోలింగ్ స్టేషన్ లలో ఉదయం 10 :30 గంటల వరకు కూడా ఒకటే ఓటు నమోదయింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఆ గ్రామాలకు తరలి వెళ్లారు.

Spread the love

Related News