అవినీతికి పాల్పడితే మంత్రులైనా ఉపేక్షించేది లేదు.. తమిళనాడు సీఎం విజయ్ హెచ్చరిక

ప్రతిపక్షం, జూలై 16: తమిళనాడులో అవినీతికి ఏమాత్రం తావు ఉండదని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే మంత్రులైనా సరే పదవుల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడే వారికి రెండో అవకాశం ఉండదని విజయ్ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇదే క్రమంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చెంగల్పట్టు జాయింట్ సెక్రటరీ వీరాసామిపై పార్టీ చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం. అవినీతిపై తమ పార్టీ వైఖరి ఎంత కఠినంగా ఉంటుందో ఈ చర్య స్పష్టం చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Spread the love

Related News

Latest News