ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 03: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లోజరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్” సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు హాజరైనారు. ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఎఫ్‌టీఏ వినియోగాన్ని పెంచడం, ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలను తీర్చిదిద్దడం, డిజిటలైజేషన్ ద్వారా వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడం తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

















