Trending Now

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఫైర్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. తెలంగాణ పోలీసులు అంటే గొప్పగా చెప్పుకొన్న పరిస్థితి నుండి ఇప్పుడు సిగ్గుపడే విధంగా పోలీసుల పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ పై ఆయన ఫైరయ్యారు. పోలీసులే సైబర్ నేరాలకు పాలపడుతన్నారంటే వ్యవస్థలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. ముగ్గురు కీలక అధికారులు కీలకమైన, రెవెన్యూ, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నక్సలైట్ల కదలికల కోసం వాడే డివైస్ ను కాంగ్రెస్ నాయకులకు వాడారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో, అప్పటి డీజీపీ, హోమ్ మంత్రి ఇతర అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిపై ప్రక్షాళన చేస్తుంటే, కొందరు అధికారులు మోకాలు అడ్డుతున్నారని కూడా అనుమానం కలుగుతోంది. ప్రణీత్ రావు బ్యాచ్ వ్యాపారస్తులను కూడా బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దండుకుంది. ఈ విషయంలో, డీజీపీ, హోమ్ సెక్రెటరీ కి లేఖ రాస్తాం అని ఆయన తెలిపారు.

Spread the love