ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. నిన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలతో HYDలో భేటీ అయ్యారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.