ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 12: నల్గొండ జిల్లా చిట్యాల మండలం సుంకేనపల్లి గ్రామ శివారులో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండు గడ్డిమోపులను తీసుకుపోతున్న డీసీఎం వాహనానికి ప్రమాదవశాత్తు విద్యుత్తు వైర్లు తలగడంతో మంటలు అంటుకున్నాయి. సమీపంలోని రైతులు దీనిని గమనించి అక్కడే ఉన్న జేసీబీ సహాయంతో గడ్డిని కింద పడేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో డీసీఎంను జేసీబీ తో బోల్తా కొట్టించారు. దీంతో వాహనానికి మంటలు అంటుకోకుండా నిరోధించగలిగారు. అయితే ఈ ఘటనలో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా సకాలంలో రాలేకపోయారు. ఏదేమైనా ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనానికి కొంతమేర నష్టం జరిగింది.