Trending Now

‘మన ఊరు – మన బడి’ బిల్లులను వెంటనే చెల్లించాలి..

ఏఐఎంఐఎం నిర్మల్ అధ్యక్షులు అజీం బిన్ యాహియ

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : గత ప్రభుత్వ హయాంలో ‘మన – ఊరు మనబడి’ పేరిట ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొత్త భవనాలు ఆధునికీకరణ కోసం కోట్లాది రూపాయలు వేచించి పనులను చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రాంతాలలో ‘మన ఊరు – మనబడి’ పథకం ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలలో అదనపు గదుల నిర్మాణాలు నూతన భవనాల నిర్మాణాలతో పాటు ఇతర పనులను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇందుకు సంబంధించిన లక్షలాది రూపాయల బిల్లులు సదరు సదరు నిర్మాణాల కాంట్రాక్టర్లకు అందక పడరాని పాట్లుపడుతున్నారు. మన ఊరు మన బడికి ద్వారా లక్షలాది రూపాయలు వెచ్చించి పాఠశాలల ఆధునికీకరణ, కొత్త భవనాలు అదనపు గదుల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు నెలల తరబడి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయమై సంబంధిత శాఖల అధికారులను అడగగా అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తే అంటూ కాలయాపన చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో శాసనసభ లోకసభ ఎన్నికలు ఉండడంతో మన ఊరు మనబడి ద్వారా చేపట్టిన పనుల బిల్లులు మంజూరులో జాప్యం జరిగిందని భావించిన అది గడిచి వారం రోజులు అవుతున్న ఈ విషయమై తిరిగి సంబంధిత అధికారులను అడిగితే ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసి సదరు నిధులను మంజూరు చేస్తేనే తాము ఏమైనా చేయగలుగుతాం తప్ప తమ వద్ద ఏమీ లేదని బదులిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మబడి పథకం ద్వారా మంజూరైన నిధులతో ఇటీవల చేపట్టిన పనులకు దరితగతిన బిల్లులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వాహాయంలో మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనులను మాత్రం విస్మరించడం శోచనీయం. మన ఊరు మనబడి ద్వారా టెండర్లు పిలిచి చేపట్టిన పనులు బిల్లులు సకాలంలో రాక అనేక చోట్లలో అర్ధాంతరంగానే నిలిచిపోయి పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతూ వస్తుంది. ఈ విషయమై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్థానిక మండల జిల్లా స్థాయి అధికారులు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోతున్నడటంతో కాంట్రాక్టర్లు అటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చొరవ తీసుకోవాలి : నిర్మల్ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అజీం బిన్ యాహియ

గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి మన ఊరు మన బడి ద్వారా పనులను చేపట్టిన కాంట్రాక్టర్లను ఆదుకునే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక తీసుకోవాలి. ఆర్థికంగా ఆ స్థాయి స్తోమత లేకున్నా పనులు చేస్తే నాలుగు పైసలు మిగులుతాయి అన్న ఆశతో పనులు చేసినా కాంట్రాక్టర్లు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో మానసిక శోభకు గురవుతున్నారు. పనులు చేపట్టేందుకు అప్పులు సప్పులు చేసి చేసుకున్న అప్పులు పెరిగిపోతూ ఆర్థికంగానూ మానసికంగానూ కృంగిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే మన ఊరు మనబడి పథకం ద్వారా చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను జారీ చేసేలా కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలి.

Spread the love

Related News

Latest News