ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై బీఎస్పీ షాద్ నగర్ నేత దొడ్డి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బహుజన వర్గాలకు అన్యాయం చేస్తే కాల్చుకొని చస్తానని, పేద ప్రజల ఆశలను కాల్చి బూడిద చేసిండని.. తన తప్పును తప్పిపుచ్చుకోవడానికే బీఎస్పీ అధినేత్రిపై బిజెపి నాయకుల ఒత్తిడి అంటూ తప్పుడు ప్రకటన చేశారని ఆరోపించారు. రక్త మాంసాలు మరిగించైన సరే బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేస్తామన్నారు. తెలంగాణ సమాజం ఆయన పై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయారనారు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ వాళ్ళ బిఎస్పి పార్టీకి లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి అన్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల పంపక వ్యవహారంలో ప్రజలతో పనిచేసిన వ్యక్తులకు కాకుండా ఇతర వ్యక్తులకు టికెట్లు ఇచ్చి టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని అదేవిధంగా మునుగోడు ఎన్నికల్లో బిఆర్ఎస్ లో నుండి పని వచ్చిన శంకరాచారికి టికెట్లు ఇచ్చి, పార్టీని బ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల, నయవంచకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.