నైజర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 22 మంది మృతి

ప్రతిపక్షం, ఆగస్టు 09: ఆఫ్రికా దేశం నైజర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 17 మంది సైనికులతో పాటు మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

శిక్షణ పూర్తి చేసుకున్న సైనిక సిబ్బంది ప్రయాణికుల బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Spread the love

Related News

Latest News