ప్రతిపక్షం, ఆగస్టు 19: బిగ్‌బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమం నేపథ్యంలో ఉప్పల్ బాలు, నటుడు నవదీప్ మధ్య వివాదం ముదురుతోంది. తనను అవమానించారని ఆరోపిస్తూ ఉప్పల్ బాలు వరుసగా వీడియోలు విడుదల చేస్తూ నవదీప్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నవదీప్ కూడా స్పందించి కౌంటర్ ఇవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.
తనను కార్యక్రమంలో అవమానించడంపై ఉప్పల్ బాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి తాను ఎలాంటి సందేశం ఇస్తున్నానో చెప్పాలని నవదీప్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఇరువురి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. తనకు మద్దతుగా నిలుస్తున్న కొందరు ఫాలోవర్లు నవదీప్‌పై అభ్యంతరకర పదజాలంతో చేసిన వీడియోలను కూడా ఉప్పల్ బాలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేయడం చర్చకు దారితీసింది. దీంతో ఈ వివాదం మరింతగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు ఇరువురి స్పందనలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు, కౌంటర్లతో కొనసాగుతున్న ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.





























