ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసుల పర్యవేక్షణ.
పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,ఏసీపీ రవీందర్ రెడ్డి,త్రీ టౌన్ సీఐ లక్ష్మీబాబు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 19: రంగధాంపల్లి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించే దసరా ఉత్సవాలు, రావణదహన కార్యక్రమాల ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ లక్ష్మీబాబు పర్యవేక్షించారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు, దేవాలయ కమిటీ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ వంగ తిరుమల్ రెడ్డి, ఐలయ్య యాదవ్, కనకయ్య, శంకరప్ప, దుర్గారెడ్డి, సత్యనారాయణ, ముత్యంరెడ్డి,యాదగిరి, రవికిరణ్,బాలరాజు, లింగం తదితరులు పాల్గొన్నారు.





























