రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకోవాలి

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి

నర్మెట పాఠశాల, నంగునూరు గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అంబేద్కర్‌కు నివాళులు..

విద్యార్థులకు రాజ్యాంగ విలువలపై అవగాహన

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 26: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంగునూరు మండలంలోని నర్మెట గ్రామంతో పాటు మండల కేంద్రంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించి, రాజ్యాంగ గొప్పతనాన్ని స్మరించుకున్నారు.

నర్మెట పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగ విలువలపై అవగాహన

నర్మెట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ సమాన గౌరవంతో జీవించేందుకు రాజ్యాంగం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలని, హక్కులతో పాటు పౌర బాధ్యతలను గుర్తించి నడుచుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మనీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నంగునూరులో అంబేద్కర్‌కు ఘన నివాళులు

మండల కేంద్రం నంగునూరులోనూ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషి, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకుంటూ, అందులో పొందుపరిచిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ పాటించాలని వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నంగునూరు సర్పంచ్ సనాదుల బాల పోచయ్య, దేవరాజ్, పంచాయతీ కార్యదర్శి నితీశ్, వార్డు సభ్యులు, రాగుల కృష్ణ, రచ్చ సిద్దు, రాజు, రాజేందర్, రాగుల వెంకన్న, దాసరి రమేశ్, బడే రాజయ్య, బాలరాజు, కార్తీక్, నర్సింగరావు, జీవన్ రెడ్డి, జెల్ల మహేందర్, పోశయ్య, యాదగిరి, శంకరయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణే నిజమైన నివాళి
విద్యాసంస్థల నుంచి గ్రామస్థాయి వరకు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడ్డాయి. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలను భావితరాలకు అందిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి.

Related News

Latest News