ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 24 : మెదక్ జిల్లా కేంద్రంలో చౌరస్తాల ఆధునీకరణ పేరుతో అభివృద్ధి పనులు చేస్తామంటున్నా పాలకులు రాందాస్ చౌరస్తా సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న పదునైన ఇనుప రాడ్ల డిజైన్‌ను తక్షణమే మార్చాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ మెదక్ నియోజకవర్గ ఇంచార్జి బట్టి అజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ నిత్యం రద్దీగా ఉంటూ ధర్నాలు, ర్యాలీలు జరిగే ఈ చౌరస్తాలో పదునైన రాడ్లు అమర్చడం ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అనుకోని ప్రమాదం లేదా తోపులాట జరిగితే ఆ రాడ్లు దిగి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, అందం కంటే ప్రజల భద్రతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మెదక్ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు అధికారులు తక్షణమే స్పందించి, ప్రమాదకర రాడ్లను తొలగించి సురక్షితమైన రైలింగ్‌తో చౌరస్తాను రీ-డిజైన్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎస్సీ వింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ హోలియదాసరి గారు, తెలంగాణ రక్షణ సేన పార్టీ మెదక్ జిల్లా ఎంబీసీ వింగ్ ప్రెసిడెంట్ ఇప్ప రమేష్ , ఏగండ , మెదక్ మండల సోషల్ మీడియా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రెహాన్ , టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేపూరు శ్రీనివాస్ , రామాయంపేట. చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు సతీష్, సూర్య, సూరజ్, హేమంత్, చిన్న ప్రశాంత్, పెద్ద ప్రశాంత్ ఇతర తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.



























