ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 25: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని. 14.15వ వార్డులో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మీ ముత్యం గౌడ్. సుమారు 200 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి అని పేద ప్రజల కోసం నిత్యమా ఆలోచించే పార్టీ అని అందుకే ప్రజా పాలనలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయేలా ఉందని ఆయన అన్నారు ముఖ్యంగా ఇల్లు లేని పేద ప్రజలను గుర్తించి ఇందిరమ్మ పథకం ద్వారా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. పేద ప్రజలకునూతన రేషన్ కార్డుల కోసం అర్హులైన ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రేషన్ బియ్యం పొందడంతో పాటు, గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రెండు వార్డు ప్రజలు పాల్గొన్నారు.





























