ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 02: చండూరు పురపాలక సంఘం పరిధిలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చికెన్, మటన్ మరియు చేపల విక్రయ దుకాణాలను మూసివేయాలని ముందస్తుగా నోటీసులు జారీ చేసి, సంబంధిత వ్యాపారులకు సూచనలు చేయడం జరిగింది.
అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి దుకాణాలు తెరిచి విక్రయాలు నిర్వహించినట్లు పురపాలక సిబ్బంది తనిఖీలలో గుర్తించడం జరిగింది.ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత చికెన్, మటన్ దుకాణాలపై మున్సిపాలిటీ అధికారులు రూ.2,500/- జరిమానా విధించారు.ఈ తనిఖీల్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, శానిటరీ జవాన్ ఇరిగి సుధాకర్, బిల్ కలెక్టర్లు జి. మహేష్, ఆర్. అనిత, జి. రమేష్ పాల్గొన్నారు.పండుగలు, జాతీయ దినోత్సవాల రోజున మున్సిపాలిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.






























