మెదక్‌లో సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్‌ ప్రారంభం

సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి.. ఆకర్షణీయమైన ఆఫర్లు, అదిరిపోయే గిఫ్టులు!

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 09: మెదక్‌ జిల్లా కేంద్రంలోని మెదక్‌ చర్చికి సమీపంలో ఉన్న సీబీఎస్‌ (చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌)లో ‘దసరా డబుల్‌ ధమాకా సేల్‌’ను సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షాపింగ్‌ మాల్‌ను సందర్శించి సందడి చేశారు. ఈ సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ.. మెదక్‌కు రావడం, సీబీఎస్‌ దసరా డబుల్‌ ధమాకా సేల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌ల కోసం అవసరమైన దుస్తులను సీబీఎస్‌లోనే కొనుగోలు చేస్తానని తెలిపారు. ఇక్కడ లభించే విభిన్న డిజైన్లు, వస్త్రాల వెరైటీలు తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. బొంబాయి నుండి హైదరాబాదులో ఉండడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

సీబీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానా సురేష్‌ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల అనుభవంతో తమ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్నారు. ప్రతి షోరూంకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. మెదక్‌ ప్రజల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక ఫ్యాషన్‌ దుస్తులను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతులు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రారంభోత్సవం సందర్భంగా షాపింగ్‌ మాల్‌కు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు చీరలు, ఇతర వస్త్రాలను కొనుగోలు చేస్తూ సందడి చేశారు. ప్రత్యేక ఆఫర్లతో షోరూం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పండుగల సందర్భంగా అందుబాటులో ఉన్న ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Spread the love

Related News

Latest News