వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
ప్రతిపక్షం, జగిత్యాల, (ప్రతినిధి) అక్టోబర్ 24: నిర్ణీత గడువు లో గా జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. శనివారం జగి త్యాల ఎమ్మెల్యే, డాక్టర్. సంజయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాలలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా పూర్తి చేయా ల్సిన పనుల వివరాలను సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే, వైద్య కళాశాల భవనంతో పాటు హాస్టల్ బ్లాక్, కిచెన్, తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి, వాటి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయా లని అధికారులను ఆదే శించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగ కుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించా రు. పనుల నాణ్యత విష యంలో ప్రత్యేక శ్రద్ధ వహి స్తూ, నిర్దేశించిన ప్రమాణా లకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టాలని తెలి పారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హాస్టల్ బ్లాక్, కిచెన్, తరగతి గదులతో పాటు కళాశాలకు సంబంధిం చిన అన్ని నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటు లోకి రావడం ద్వారా జిల్లా లో వైద్య విద్య అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందు కు దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను వేగవం తం చేసి, అవసరమైన అన్ని వసతులతో కళాశాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కావడం ప్రజలకు, విద్యార్థు లకు ఎంతో ప్రయోజనకర మని తెలిపారు. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే జిల్లాలోని విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించేం దుకు మెరుగైన అవకాశాలు లభించడంతో పాటు, ప్రజ లకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని పేర్కొ న్నారు. వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవం తం చేసి, నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ పనులతో పాటు విద్యార్థులకు అవస రమైన హాస్టల్, కిచెన్, తరగతి గదులు తదితర మౌలిక వసతులను నాణ్యతతో ఏర్పాటు చేయాలని తెలిపారు.నిర్మాణ పనుల విషయంలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్క రించుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాల త్వరితగతిన అందుబాటు లోకి వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సంబం ధిత శాఖల అధికారులు, వైద్య కళాశాల నిర్మాణ పనులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
































