ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 29: కరీంనగర్ పట్టణంలోని విద్య నగర్ కు చెందిన కొంపల్లి రవీందర్ ( 56) ఆదివారం 21 కిలోమీటర్ల ను 56 సంవత్సరాలు దాటిన తర్వాత 2 గంటల 26 నిమిషాలలో పూర్తి చేయడం గొప్ప విశేషం, అలాగే ఆగస్టు 30న హైదరాబాదులో 10 కిలోమీటర్లను పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం ఎస్ ఆర్ ఆర్ కాలేజి వాకర్స్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది కొరివి వేణుగోపాల్ ఆయనకు శాలువాగప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వయసులో కూడా అన్ని కిలోమీటర్లను పూర్తి చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, వెన్న రాజ మల్లయ్య, సిగిరి శ్రీధర్, శనిగరం స్వామి, పంబాల అశోక్, బొగ్గుల సంతోష్, రిటైర్డ్ ఎస్సై మాధవరావు, మైపాల్ రెడ్డి ( ఎస్ వి జె సి ), మునీందర్, ఏ భాస్కర్, రాజశేఖర్ రెడ్డి, రామ్ రెడ్డి, మహిళా వాకర్స్ పాల్గొన్నారు.





























