— బుగ్గారం ఎస్.ఐ, శ్రీకాంత్, బ్లూకోల్ట్, కానిస్టేబుల్, సంపత్ చాకచక్యంతో బంగారం గుర్తింపు.
— తక్షణ స్పందన, విధి నిర్వహణ పట్ల అంకిత భావాన్ని అభినందించిన. — జిల్లా ఎస్పీ, అశోక్
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్, 09: బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పొరపాటున పోగొట్టుకున్న 10, తులాల బంగారాన్ని డయల్ 112, కు వచ్చిన ఫిర్యాదుపై బుగ్గారం, పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే గుర్తించి బాధి తుడికి తిరిగి అప్పగించారు. పోలీసుల తక్షణ స్పందన, చాకచక్యమైన విచారణతో బాధితుడికి విలువైన బంగా రం తిరిగి లభించింది. వివ రాల్లోకి వెళితే గొల్లపల్లి మండలానికి చెందిన మూట శంకర్ తన మరదలి వివా హం నిమిత్తం బొంబాయి,లో 10, తులాల బంగారం కొను గోలు చేసి బ్యాగులో భద్రప రుచుకొని ధర్మపురికి బయలుదేరాడు. జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా వెల్గొండ స్టేజీ దాటిన అనంతరం తన బ్యాగు కనిపించకపోవడం తో వెంటనే డయల్ 112, కు ఫోన్ చేసి పోలీసులకు సమా చారం అందించాడు. వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్, విధు ల్లో ఉన్న బుగ్గారం, పోలీస్ కానిస్టేబుల్ సంపత్ (2177) ఫిర్యాదు వివరాలను ఎస్ఐ, శ్రీకాంత్,కు తెలియజేశారు. దీంతో ఎస్.ఐ, శ్రీకాంత్ కానిస్టేబుల్ సంపత్,తో కలిసి తక్షణమే రంగంలోకి దిగి వెల్గొండ స్టేజీ పరిసరాల్లో విచారణ చేపట్టారు. గ్రామం లో యువకులను ఆరా తీస్తూ, రాత్రి సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనే కోణంలో వివరాలు సేకరించారు.
ఈ క్రమంలో యువకులు ఇచ్చిన సమాచారంతో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి విచారిం చగా, బస్సులో తన బ్యాగు అనుకొని పొరపాటున మరొకరి బ్యాగును తీసుకువచ్చినట్లు గుర్తించారు. రెండు బ్యాగులు ఒకే విధంగా ఉండటంతో జరిగిన పొరపాటును నిర్ధారించి, ఆ బ్యాగును తనిఖీ చేయగా అందులోని చిన్న బ్యాగులో భద్రపరిచిన 10 తులాల బంగారం లభించింది.అనంతరం ఎస్.ఐ, శ్రీకాంత్ బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితుడు మూట శంకర్,ను అతని బావమ రిదిని పోలీస్ స్టేషన్కు పిలిపించి 10, తులాల బంగారాన్ని వారికి అప్ప గించారు. డయల్ 112, కు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, కేవలం గంట వ్యవధిలోనే చాకచక్యంగా విచారణ చేపట్టి పోగొట్టు కున్న 10, తులాల బంగా రాన్ని గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించిన బుగ్గారం ఎస్.ఐ, శ్రీకాంత్, బ్లూకోల్ట్స్, కానిస్టేబుల్ సంపత్, (2177) లను జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు ఆపద సమయంలో పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, ను సంప్రదించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, సూచించారు.




























