తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం – సత్తా చాటిన నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్

*33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా నల్గొండలో 300కు పైగా బూత్ కమిటీలు.

*జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి జాతీయ నేత మనీష్ శర్మ అభినందనలు.

ప్రతి పక్షం మునుగోడు సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ పనితీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.గత ఆరు నెలల కాలంలో నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నిర్వహించిన నిరసనలు, పార్టీ పిలుపు మేరకు చేపట్టిన యువత కార్యక్రమాలు, మండల-అసెంబ్లీ స్థాయిలో నిర్వహించిన సంస్థాగత కార్యక్రమాలు, బూత్ స్థాయిలో సంస్థను బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలను ఫోటోలు, వీడియోలతో కూడిన ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి వివరించారు.సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి & యువజన కాంగ్రెస్ ఆర్గనైజేషన్ జాతీయ ఇన్‌చార్జ్ శ్రీ మనీష్ శర్మ నల్గొండ జిల్లా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
*తెలంగాణలోనే నల్గొండ ఫస్ట్:
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా నల్గొండ జిల్లాలో ఇప్పటికే 300కు పైగా యువజన కాంగ్రెస్ బూత్ కమిటీలను ఏర్పాటు చేయడాన్ని మనీష్ శర్మ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారు.
*రానున్న లక్ష్యాలు:
రానున్న ఆరు నెలల్లో జిల్లాలో మిగిలిన 1,515 పోలింగ్ బూత్‌లలో కమిటీలను ఏర్పాటు చేసి, మొత్తం 1,815 పోలింగ్ బూత్‌లలో కమిటీల ఏర్పాటును పూర్తి చేయడమే లక్ష్యమని మేకల ప్రమోద్ రెడ్డి తెలిపారు.వచ్చే ఏడాది ఆగస్టు 9న జరగనున్న యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, నల్గొండ జిల్లాలోని 1,000కు పైగా గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో యువజన కాంగ్రెస్ జెండాలను ఆవిష్కరించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

Spread the love

Related News

Latest News