[t4b-ticker]

బిజెపివి చీప్ పాలిటిక్స్..

నిమజ్జన ఏర్పాట్లపై రాద్ధాంతం ఏంటి

పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు

మేడిపల్లి సత్యం చోరువతో నీటి విడుదల

అనంతుల రమేశ్ డీసీసీ అధికార ప్రతినిధి

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 21: వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బిజెపి పార్టీ చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు తెర లేపడం సిగ్గుచేటని డిసిసి అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డాడు.. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలం లేదని బిజెపి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బిజెపి పండుగ ఏర్పాట్లను నిమజ్జనం చేసే విషయంలో బాధ్యత యుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగి,అనవసర అల్లర్లకు ఆజ్యం పోయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రతి ఏటా నిధుల కేటాయింపు తో పాటు ఎస్సారెస్పీ నీటి విడుదలపై చర్యలు తీసుకుంటున్న విషయం బిజెపికి తెలియంది కాదని, ప్రజల దృష్టి మరల్చేందుకు నిమజ్జనం ఏర్పాట్లను కూడా రాజకీయం చేయడం బిజెపికే చెందిందని మండిపడ్డారు.. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి తోటి మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారని అన్నారు.. నీటి విడుదల ప్రక్రియను గమనించిన బిజెపి నాయకులు నీటి విడుదల క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు చీప్ పాలిటిక్స్ కు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.. పవిత్రమైన పండుగలను కూడా రాజకీయాలకు జోడించి లబ్ధి పొందాలని బిజెపి తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు.

Spread the love

Related News

Latest News